హుజూర్ నగర్ ఏప్రిల్ 26 (జనంసాక్షి): సమ సమాజ స్థాపన సిపిఐ లక్ష్యమని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు అన్నారు. బుధవారం సిపిఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యల్లు తప్ప, కారల్ మార్క్స్ నినాదంతో పోరాడి ప్రాణాలర్పించుకున్న అమరవీరుల గుర్తుగా మేడే వేడుకలు జరుపుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టడంలో సిపిఐ ముందుంటుంది అన్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేది ఏఐటీయూసీ నే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంబాల శ్రీనివాస్, దేవరం మల్లేశ్వరి, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, నాయకులు ఎల్లావుల రమేష్, దొంతగాని సత్యనారాయణ, గుండా రమేష్, జడ వెంకన్న, పశ్య వెంకట్ రెడ్డి, చేన్నగాని సైదులు, సోమగాని కృష్ణ, చక్రాల స్టాలిన్, ఎల్లావుల ఉమా, మామిడి వెంకయ్య పాల్గొన్నారు.




