Wednesday, 4 November 2026

దోమల నివారణ చర్యలు తీసుకోవాలి- సి పి ఎం

 

 

 

 

 

 

 

పెనుబల్లి, జనవరి28(జనం సాక్షి)గ్రామాల్లో దోమల నివారణ చర్యలు తీసుకోవాలని
సిపిఎం పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఎంపీడీవోమహాలక్ష్మికి అందించారు, పెనుబల్లి మండలంలో 33 గ్రామపంచాయతీల్లోని సుమారు 44 గ్రామాల్లో విపరీతంగా పెరిగి పోయాయని వాటికి తగిన మందులు పిచికారి చేయాల్సిన అధికారులు నిమ్మక నేరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని, ప్రజలుదోమ కాటువలన బెంబేలు ఎత్తిపోతున్నారని, అనేక జబ్బులకు లోన్ అవుతున్నారని, పశువులు, మేకలు, గొర్రెల, ఉన్నటువంటి వారు వాటి రక్షణ కూడా కరువైందని, పశువులు జీవాలకు వైద్యం అందటం లేదని, ఇబ్బంది పడుతున్న జంతువులకు వైద్య సేవలు అందించాలని, ప్రతి గ్రామపంచాయతీలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజలు అనారోగ్య పాలవుతున్న తీరుని, అధికారులు తక్షణమే పట్టించుకోవాలని, వైద్య సదుపాయాలు కల్పించాలని, పశువులకు జీవాలకు రక్షణ కల్పించాలని, ఈ సందర్భంగా సి పి ఎం పార్టి నాయకులు చలమాల విఠల్ రావు ఎం పి డి ఒ ని కోరారు, ఎంపీడీవో తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింద న్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతరావు, నల్లమల అరుణ్ ప్రతాప్ , టి రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.