తణుకు సిఎం సభలో యువకుడి హల్‌చల్‌

ఏలూరు,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  తణుకులో జరిగిన సీఎం జగన్‌ సభలో ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. ముఖ్యమంత్రిని కలిసేందుకు బారికేడ్లను దూకి సభా వేదికవైపు దూసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకుని పక్కకు తీసుకువెళ్లారు. ఆ యువకుడు ఒంటి నిండా వైసీపీ రంగులు పూసుకుని సభా ప్రాంగణంలో హంగామా చేశాడు. అలాగే తణుకులో జరిగిన జగన్‌ సభలో ఓ మహిళా నినాదాలు చేయడం కలకలం రేపింది. తనకు పెన్షన్‌ రావడంలేదంటూ ఆందోళనకు దిగింది. వెంటనే అక్కడున్న అధికారులు ఆ మహిళకు సర్దిచెప్పారు. న్యాయం చేస్తామని
హావిూ ఇచ్చారు.