తనకు తాను ప్రకటించుకున్న ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవి చెల్లదు..
పదవి చెల్లదు..
భువనగిరి టౌన్ (జనం సాక్షి :–
వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ముల బాబు గారి అనుమతితో రాష్ట్ర సర్వసభ్య సమావేశం హైదరాబాదులోని మింట్ కాంపౌండ్ లోని స్ఫూర్తి భవన్ నందు జరిగింది .అందులో అన్ని జిల్లాల కమిటీల అభిప్రాయం మేరకు రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ కొంపెల్లి బిక్షపతి ప్రధాన కార్యదర్శిగా యానం విజయ్ కుమార్ కోశాధికారిగా ఆర్ కిషన్ నాయక్ గారు పూర్తి రాష్ట్రస్థాయి కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ రాష్ట్ర కమిటీ రెండవసారి 25 ఆగస్టున మింట్ కాంపౌండ్ నందు రాష్ట్ర కార్యవర్గ సమావేశంసమావేశం జరుగుతున్న సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి తోంట సత్యనారాయణ సంఘ నియమాలకు విరుద్ధంగా వరంగల్ లోని వ్యవస్థాపక అధ్యక్షులను తప్పు త్రోవ పట్టించి తనకు తానే రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించుకోవడం జరిగింది ఇది పూర్తిగా సంఘ నియమాలుకి విరుద్ధం ఈ ఎన్నిక చెల్లదని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి గారు తెలిపారు.సంఘం నియమ నిబందనలకు విరుద్దంగా ప్రవేటించిందున అతనిపై సంఘ పరమైన చర్యలు తీసుకోబడును. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి వెంకన్న నల్గొండ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ యాదాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోయరాము జిల్లా నాయకులు ఎం రాధిక దుబ్బాక యాదయ్య ఉప్పల నరసయ్య సోమయ్య మామిడి సైదులు తదితరులు పాల్గొన్నారు.