– తనకిప్పుడు కొత్తగా వచ్చిన ఆస్తులేవీ లేవు
– చాలాకాలం నుంచే తాను వ్యాపారంలో ఉన్నాను
– విూడియా చిట్‌చాట్‌లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటెల
హైదరాబాద్, ఆగస్టు 30(జనంసాక్షి): తనను ఓడించేందుకు ప్రత్యర్థులకు డబ్బులు పంపించారని మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఈటల విూడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించేందుకు ప్రత్యర్థులకు డబ్బులు పంపించారని ఈటల రాజేందర్ అన్నారు. అయితే డబ్బులు ఎవరు ఎందుకు పంపించారనేది ఇప్పటికీ అర్థం కాలేదన్నారు. తనపై కొంతమంది దుష్పచ్రారం చేస్తున్నారని, వారి వెనుక ఎవరో పెద్ద వ్యక్తులే ఉన్నట్లు అర్థమవుతుందని అన్నారు. తనకిప్పుడు కొత్తగా వచ్చిన ఆస్తులేవీ లేవని చాలాకాలం నుంచే తాను వ్యాపారంలో ఉన్నానని ఈటెల తెలిపారు. తన ఆస్తులపై ఈసీ చేత దాడులు కూడా చేయించారని అన్నారు. తన వద్ద ఎలాంటి దాపరికాలు ఉండవని, తాను ఏపని చేసినా నిజాతీగా చేస్తానని, నిజాయితీగా సంపాదించుకుంటానని అన్నారు. తాను ఎవరి వద్దనైనా ఒక్కరూపాయి తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు. పలు పత్రికల్లో వస్తున్న వార్తలపై తాను ఇప్పడే స్పందించనని, సరియైన సమయం వచ్చినప్పుడు అన్నింటికి సమాధానం చెబుతానని అన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ను కలుస్తారా అని విలేఖరులు ప్రశ్నించగా. తాను కేసీఆర్‌ను కలిసే ఆలోచన ఇప్పుడు లేదని, సమయం చూసుకొని కలుస్తానంటూ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు పలు ప్రశ్నలు సంధించగా.. విూడియా ప్రతినిధులు కొద్దిరోజులు తనను వదిలేయాలని ఈటల అన్నారు. ఇదిలా ఉంటే ఈటల వ్యాఖ్యలపై తెరాస శ్రేణుల్లో విస్తృత చర్చ సాగుతుంది. శుక్రవారం సాయంత్రం తనను బదనాం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ, నేను కులం పేరుతో మంత్రి పదవి సంపాదించలేదని, గులాబీ జెండాలకు ఓనర్లం మేమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిపై మళ్లీ సాయంత్రం సమయంలో ప్రతిప్రకటన ద్వారా తన వ్యాఖ్యలను బూతద్దంలో పెట్టి చూడవద్దని, తమ నాయకుడు కేసీఆర్ అని ఈటెల ప్రకటన చేశారు. దీంతో ఈ వివాదం సర్థుమణిగిందని అందరూ భావించిన సమయంలో శనివారం మళ్లీ ఈటల విలేకరుల చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వివాదం ఎటు దారితీస్తుందోనని టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.




