ఢిల్లీ : స్వామి వివేకానందతో దావూద్ ఇబ్రహీంను పోలుస్తూ తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఖాజపా అధినేత నితిన్ గడ్కరీ తీవ్ర పశ్చాత్తాపం ప్రకటించారు తాను నిజంగా అలా పోల్చలేదని స్వామి వివేకానందపై దుష్ప్రచారం చేయడం తన అభిమతం కాదని తన వ్యాఖ్యలు ఎవరికైనా నొప్పిస్తే క్షంతవ్యుడనని గడ్కరీ మంగళవారం ప్రకటించారు ఆదివారం భోపాల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తెరలేపాయి దాంతో గడ్కరీ ఈరోజు వివరణ ఇచ్చారు భాజపాలో ప్రతిఒక్కరికి స్ఫూర్తి వివేకానందుడేనని పేర్కొన్నారు




