Wednesday, 4 November 2026

తన కుర్చీ కోసం కొట్లాడి, వైస్ ఎంపీపీనీ మరిచి, తన కుర్చీకి ఎఫెక్ట్ చేసుకున్న ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్

, కుర్చీ కోసమే అవిశ్వాస తీర్మానం పెడతాము ఎంపీపీ కుర్చీ లేకుండా చేస్తాం,

బషీరాబాద్ మండల పరిషత్ సాధారణ సర్వసభ సమావేశానికి హాజరుకాని ఎంపిటిసిలు
టెన్షన్ టెన్షన్ లో ఎంపీపీ,

బషీరాబాద్ జనవరి 24, (జనం సాక్షి) : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో తాహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రాజకీయం తారస్థాయికి చేరింది. ఈ సందర్భంగా ఎంపిటిసిలు మాట్లాడుతూ ఎంపీపీ తన కుర్చీ కోసం కొట్లాడి వైస్ ఎంపీపీ నీ మరిచారని చెప్పారు.ఇందులో ఎంపీటీసీలకు ఎలాంటి గౌరవం ఇవ్వకపోవడం, ఎంపిటిసి లకు గ్రామ అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం ఎలాంటి నిధులు వచ్చిన ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ పనులు చేస్తూ. ఎంపీటీసీలు మేము ఎవరితో చెప్పుకోవాలి. ఆన్ని మేము గెలిచి మా గ్రామ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోతే మా ఎంపీటీసీలు ఎందుకని మూకుమ్మడిగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దగ్గరికి వెళ్లి గ్రామ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వమని అడగగా,ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి,వెంటనే స్పందించి ఎంపీటీసీకి గ్రామ అభివృద్ధి కొరకు ఒక్కొక్క ఎంపిటిసి కి 20 లక్షలు చొప్పున నిధులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎంపిటిసిలు మూకుమ్మడిగా మీ వెంట మేముంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్, మంతటి ఎంపిటిసి శ్రీధర్, క్యాద్గిరా ఎంపిటిసి సురేష్, పర్వత్ పల్లి ఎంపిటిసి బంటు రాజు, నవల్గా ఎంపిటిసి లక్ష్మీబాయి, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రజాక్, వీరితోపాటు బషీరాబాద్ మండల నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ తన్వార్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు రెడ్డి (నర్సిరెడ్డి), నాయకులు సాయిలు గౌడ్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.