Thursday, 5 November 2026

తపాలా సేవలు సద్వినియోగం చేసుకోవాలి మహిళల కోసం సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకం

 

 

 

 

 

 

 

ఖానాపూర్ రూరల్17 మే (జనం సాక్షి): తపాల సేవలు ఇంట్టిఇంటికి అందిస్తామని ప్రజలు తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలని సబ్ పోస్ట్ మాస్టర్ రాజేందర్ అన్నారు.నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో తపాల సిబ్బంది తో బుధవారం రోజున ఇంటింటికి వెళ్తూ చిన్న మొత్తాల పొదుపు పథకంలో భాగంగా మహిళల ఆర్ధిక ప్రయోజనాల లక్ష్యం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేసిపెట్టిన “మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్” పథకం గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా తపాల సబ్ డివిజన్ అధికారి షఫీఉద్దీన్ ఆదేశాల మేరకు ఇంట్టిఇంటికి వెళ్లి పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పొదుపు పథకాల గురించి ప్రజల కు అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరూ తపాల శాఖ లో ఖాతాదారులగా చేరితే భవిష్యత్ లో కాసుల మోత గా ఉంటుంది అని ఆయన అన్నారు. మహిళలు,బాలికల పేరట ఒకే దప ఒక వేయి రూపాయల నుండి గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అని తెలుపరు. ఈ పథకం లో జమచేసిన డిపాజిట్ కు వడ్డీ 7.5.శాతం తో కట్టిస్తారని ఆయన తెలిపారు. ఈ పథకం కాల పరిమితి 2సంవత్సరాలు గా ఉంటుంది అని,అంటే ఖాతాదారుల కు అవసరం కోసం ఖాతా తెరచిన నుంచి ఆరు మాసల తర్వాత జమ చేసిన నగదు ను ఎప్పుడైనా డిపాజిట్ రూపాయల ను తీసుకొనే సదుపాయాలు కలిపించినట్లు ఆయన తెలిపారు ఈ పథకం లో మహిళలు, బాలికలు చేరవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మెన్ రంజిత్,యం.నర్సయ్య, ఇర్ఫాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.