Thursday, 5 November 2026

సీఎం కప్ మండల స్థాయి క్రీడా కారులకు బహుమతుల ప్రధానం ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి.

 

 

 

 

 

 

వీణవంక 17 మే (జనం సాక్షి) వీణవంక : మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాల బహుమతులు ప్రధానం చేశారు. గ్రామీణ స్థాయిలో ఉన్న యువతకు క్రీడా నైపుణ్యం ను వెలికితీయలనే ఉదేశం తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 15 తేదీ నుండి 17 తేదీ వరకు గత మూడు రోజులు గా నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలు బుధవారం ముగిసాయి,ఈ సందర్భంగా మూడురోజులు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన క్రీడా కారులకు ఎంపిపి మూసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి. మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా పరిషత్ డిప్యూటీ సి ఓ టి పవన్ కుమార్. క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు వాలీబాల్ విన్నర్స్.. మల్లారెడ్డిపల్లి. ,రన్నర్స్ గా చల్లూర్.,
కబడ్డీ విన్నర్స్…చల్లూర్ రన్నర్ గా వీణవంక
టీమ్.
కో కో లో…విన్నర్స్ గా మల్లారెడ్డి పల్లి గ్రామం , రన్నర్స్ గా ఎల్బాక గ్రామం టీమ్
అథ్లెటిక్స్ ..100 మీటర్ విన్నర్స్ ఎండి అర్ఫాన్. చల్లూరు గ్రామం టీమ్, రన్నర్స్ గా కే. సాయినాథ్ రెడ్డి. ఎల్బాక గ్రామ టీమ్ ,

అథ్లెటిక్స్ లో… 400 మీటర్స్ లో , 1. సాయి చరణ్ మల్లారెడ్డిపల్లి గ్రామం
2.. ముషరాఫ్ చల్లూర్ గ్రామం
3. కే సాయినాథ్ రెడ్డి ఎల్బాక గ్రామం
లాంగ్ జంప్… 1.ఎండి అర్ఫాన్ చల్లూరు గ్రామం
2. చందు మల్లారెడ్డి పల్లి గ్రామం.
షార్ట్ పుట్…..1. వంశీ వీణవంక గ్రామం
2. అజారోద్దీన్ చల్లూర్ గ్రామం.
షాట్ పుట్… 1.మహిళా విభాగం పి.పద్మ
గెలుపొందగా వారికి ప్రశంసా పత్రాలు, షీల్డ్ లను అందజేశారు. ఈ గెలుపొంది న వారిని జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని ఎంపిపి మూసి పట్ల రేణుక తిరుపతి రెడ్డి ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాడ సాధవ రెడ్డి. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎక్కేటి రఘు పాల్ రెడ్డి. ఉప సర్పంచ్ భానుచందర్ ఎంఈఓ విడపు శ్రీనివాస్. ఎంపీ ఓ ప్రభాకర్. నాగిరెడ్డి. సర్పంచులు కాంత రెడ్డి. చదువు మహేందర్ రెడ్డి , పి టీలు ఆయా గ్రామ పంచాయతీ సెక్రటరీ లు తో పాటు ఆయా గ్రామాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.