Tuesday, 3 November 2026

తప్పు ఒప్పుకున్న అంకిత్‌ చవాన్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో అరెస్టయిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు అంకిత్‌ చవాన్‌ తప్పు ఒప్పుకున్నాడు,. ప్రస్తుతం పోలీస్‌ కస్టడిలో ఉన్న అంకిత్‌ విచారణ సందర్భంగా బోరున విలపించినట్లు సమాచారం. తాను స్పాట్‌ ఫిక్సింగ్‌ పాల్పడింది నిజమేనని చవాన్‌ అంగీకరించాడు. మొదట్లో స్పాట్‌ ఫికింగ్‌కు ఒప్పుకోకపోయినా…బుకీ ఒత్తిడి వల్ల చివరకు ఒప్పుకున్నట్లు విచారణలో అంకిత్‌ చెప్పడం విశేషం.
శుక్రవారం ఉదయం నుంచి అరెస్ట్‌ చేసిన ముగ్గురు ఆటగాళ్లను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. ఫిక్సింగ్‌కు పాల్పడటం వల్ల నీ క్రికెట్‌ కెరీర్‌ ఇక ముగిసినట్లేనని పోలీసులు చెప్పినపుడు అంకిత్‌ కన్నీళ్లు పెట్టినట్లు సమాచారం. అజిత్‌ చండీలానే చవాన్‌ను స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడేలా చేశాడని పోలీసులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *