తమిళనాడులో భారీ పేలుడు

febuulfxతమిళనాడు: శివకాశి జిల్లా నారాయణపూర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో దాదాపు వంద మంది కార్మికులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనలో ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫ్యాక్టరీలో పేలుడుకు గల కారణాల గురించి అధికారులు అన్వేశిస్తున్నారు.