Wednesday, 4 November 2026

తరుగుల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలి – గిట్టుబాటు ధర విషయంలో ఎటువంటి కొర్రీలు పెట్టొద్దు

 

 

 

 

 

(జనంసాక్షి): మిల్లర్లు ఎటువంటి తరుగుల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దొంతగాని లక్ష్మమ్మ ఆధ్వర్యంలో పాలకమండలి సమావేశం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో రైస్ మిల్లర్ ఓనర్లతో, రైతులతో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రైతు కష్టపడి పండించిన పంటలు నిభద్రతతో కొనుగోలు చేయాలన్నారు. గిట్టుబాటు ధర విషయంలో ఎటువంటి కొర్రీలు పెట్టొద్దు అన్నారు. పతి గింజ కూడా మిల్లర్లు కొనుగోలు చేయాల్సిందేనన్నారు. గ్రేడ్ల పేర్లతో ధరలు వ్యత్యాసం చూపించవద్దన్నారు. రైతులు కూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి గింజను హుజూర్నగర్ నియోజకవర్గం లోనే కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే ధాన్య రాశికి పుట్టినిల్లు అన్నారు. రైతు సమస్యలపై మిల్లర్లకు వివరించగా మిల్లర్స్ కూడా స్పందించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రామలింగారెడ్డి, కార్యదర్శి క్యారం సంగయ్య, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి పోలిశెట్టి నరసింహారావు, సింగిరికొండ శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.