Thursday, 5 November 2026

తరుగు పేరుతో రైస్ మిలర్ల మోసం * రైస్ మిల్ ఎదుట రైతుల ఆందోళన

 

 

 

 

 

 

జనం సాక్షి /కొల్చారం మండల కేంద్రంలోని రైస్ మిల్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక బస్తాలో 41 కిలోల 600 గ్రాములు తూకం వేయవలసి ఉండగా 45 కిలోల వరకు తూకం వేస్తున్నారని తరుగు పేరుతో తమకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని ప్రభుత్వ నిబంధనలను మేరకే తూకం వేయాలని రైతులు హెచ్చరించారు లేనిపక్షంలో ఆందోళన చేస్తామని వారు తెలిపారు.. రైతులను రైస్ మిల్లర్లు మోసం చేస్తున్నప్పటికీ స్థానిక తహసిల్దార్ మాత్రం పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైస్ మిల్లర్లు రెచ్చిపోతున్నారని వారు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రైస్ మిల్లర్లను కట్టడిచేయాలది తెలిపారు