పెనుబల్లి, మే 10(జనం సాక్షి) ప్రమాద వశాత్తు మరణించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు బుదవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెలికాని రాజబాబు రాజీవ్ గాంధీ భీమా పథకం చెక్కుల ను పంపిణీ చేసారు.
పెనుబల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యుత్వం కలిగి ఉన్న కార్య కర్తలైన ఏరుగట్ల గ్రామానికి చెందిన రావూరి శివాజీ, వి ఎం బంజర్ గ్రామానికి చెందిన కొణిజేటి రోహిత్ కుటుంబసభ్యులను పరామర్శించి రెండు లక్షల రూపాయల రాజీవ్ గాంధీ భీమాపధకం చెక్కుల ను మండల పార్టీ ఆధ్వర్యంలో చెలికాని రాజబాబు కుటుంబసభ్యులకు అందించడం జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ డిజిటల్ సభ్యత్వం కలిగి ఉండటంవలన ఈ రోజు పార్టీ వారిని ఆదుకోవడం జరిగింద ని అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆదేశాలమేరకు మాజీమంత్రి సంభాని అధ్యక్షతన సత్తుపల్లి నియోజకవర్గంలో ఆయా మండల కాంగ్రెస్ నాయకుల సహకారంతో నియోజకవర్గంలో సుమారు 45వేల డిజిటల్ సభ్యత్వాలు చేయించ డం జరిగిందని, ఖమ్మం జిల్లాలోనే అత్యధిక సభ్యత్వాలు చేసింది సత్తుపల్లి నియోజకవర్గమేనని అన్నారు, అలాగే మన నాయకులు సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ కార్యకర్త కు ఏదైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబసభ్యులకు అండగా నిలబడి ఆర్ధికంగా మేలుచేయాలన్న ఆలోచనతో ప్రత్యేకశ్రద్ద తీసుకొని ఆయన సొంతగారుసుము చెల్లించి సభ్యత్వాలు కల్పించడం జరిగిందని అన్నారు, ఈరోజు అలాంటి కుటుంబాలకు ఆర్ధికంగా లాభం చేకూరిందని తెలిపారు. ఈ సంధర్భంగా
కాంగ్రెస్ పార్టీకి, సంభానికి మండల కాంగ్రెస్ కమిటి నాయకులకు కుటుంబసభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి కృష్ణయ్య, మాజీ సర్పంచ్ మామిళ్ళ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు నున్నా సురేష్, గోగినేని రమేష్, ఎన్రోలర్ మేకతొట్టి కాంతయ్య, చింతల దేవేంద్ర బాబు, కర్రి వెంకటాద్రి యాదవ్, భూక్యా పుల్లయ్య, సాదుసత్యం,గోపయ్య,కొత్తపల్లి నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రావూరి మారేశ్వర రావు, మరియమ్మ, కళావతి, కొణిజేటి నిర్మల, కుమారి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.




