Thursday, 5 November 2026

14వ రోజుకు చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె. జిల్లా అధ్యక్షులు గోరినేని రాజేశ్వరరావు బహిష్కరణ.

 

 

 

 

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 11.(జనం సాక్షి). ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరుతూ చేపట్టిన సమ్మె గురువారం 14వ రోజుకు చేరుకుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను తప్పు పట్టారు. ప్రభుత్వం తక్షణమే జూనియర్ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఐక్యతను దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొడతామని అన్నారు. నిరసన దీక్షలు జిల్లాలో నాయకులు అన్ని మండలాల నుండి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

జిల్లా అధ్యక్షుడు బహిష్కరణ..

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సంఘం జిల్లా అధ్యక్షులు రాజేశ్వర రావు పంచాయతీ కార్యదర్శులు ప్రయోజనాలకు వ్యతిరేకంగా వివరించడంపై ఆగ్రహించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు రాజేశ్వరరావును బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.