జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని సీయోను ప్రార్ధన మందిరం సీనియర్ పాస్టర్ పల్లె మాణిక్యం శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందడంతో మంథని నియోజకవర్గం లోని క్రైస్తవులు విషాదంలో మునిగారు. ఆదివారం క్రైస్తవ సంఘ పెద్దలు, సోదరులు ప్రత్యేక ప్రార్థనలతో సీనియర్ పాస్టర్ మాణిక్యం కు అంతక్రియల కార్యక్రమం నిర్వహించారు. మంథని నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పాస్టర్ పల్లె మాణిక్యం గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా మాణిక్యం పాస్టర్ దైవ సేవలో విశిష్టమైన పాత్ర పోషించారు. క్రైస్తవ మతంలో విశిష్ట సేవలతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన ఆకస్మికంగా శనివారం రాత్రి మంథని పట్టణం పవర్ హౌస్ కాలనీ లోని తన స్వగృహంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆదివారం మంథని నియోజకవర్గంలో పాస్టర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి అంతిమ క్రియలకు హాజరయ్యారు. పాస్టర్ మాణిక్య మృతి క్రైస్తవ లోకానికి చాలా బాధాకరమని పాస్టర్ వల్లూరి ప్రభాకర్, సంఘ పెద్దలు అంకరి కుమార్ మాణిక్యం చేసిన దైవ సేవలు గుర్తు చేసుకుంటూ విచారం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పాస్టర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంకే జోసఫ్, మంథని ప్రసాద్, అందే రమేష్, దాసరి సదానందం, చింతకుంట్ల ప్రేమ్ కుమార్ తో పాటు పాస్టర్లు సంఘ పెద్దలు, విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సీనియర్ పాస్టర్ మాణిక్యం ఆకస్మిక మృతి ప్రత్యేక ప్రార్థనల మధ్య అంత్యక్రియలు




