తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు అండగా నిలిచిన సర్పంచ్ షేక్ సలీమారంజాన్ హుజూర్ నగర్ డిసెంబర్ 09(జనంసాక్షి): తల్లిదండ్రులు కోల్పోయి అనాధలు అయిన పిల్లలకు బూరుగడ్డ సర్పంచ్ షేక్ సలీమారంజాన్ అండగా నిలబడ్డారు. మండల పరిధిలోని
బూరుగడ్డ గ్రామానికి చెందిన బడేటి రమేష్అనిత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. మూడు సంవత్సరాల క్రితం అనారోగ్య కారణంతో బడేటి రమేష్ మరణించారు. తండ్రి మరణాన్ని మరవకముందే ఇప్పుడు తల్లి కూడా మరణించింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాధలు అయిన పిల్లల పరిస్థితిని చూసి చలించిపోయిన గ్రామ సర్పంచ్ 20 వేల రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు. ఈ విషయం తెలుసుకున్న వారి పెద్ద కుమారుడు షేక్ లాల్ మదర్ (సీఐ నర్సాపూర్) వారి స్నేహితుడు సాయి అభిషేకు ఈ విషయం తెలపగా అతను వెంటనే స్పందించి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా పంపారు. ఈ మొత్తాన్ని ఆ పిల్లల బాగోగులు చూసుకుంటున్న వారి మేనమామ సమక్షంలో సర్పంచ్ సలీమారంజాన్ చేతుల మీదుగా ఆ పిల్లలకి అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ షేక్ సలీమా రంజాన్ మాట్లాడుతూ ఆ పిల్లలకు జరిగిన లోటును ఎవరు తీర్చలేనిది, ఆ పిల్లల పరిస్థితికి నేను చాలా బాధపడుతున్నానని, అలాగే వారి తల్లిదండ్రుల ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు. అలాగే ఆ పిల్లలను మీరు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ అలీమ్ పాషా, గండు సైదులు, ఆవుల వెంకటయ్య, గండు చిన్న సైదులు, వేముల సైదులు, ఏనుగుల సత్యనారాయణ, నందిగామ వేణు, గడ్డం నరసింహారావు, బండ్ల రాములు, ఏనుగుల చంద్రశేఖర్ పాల్గొన్నారు
తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు అండగా నిలిచిన సర్పంచ్ షేక్ సలీమారంజాన్




