Friday, 6 November 2026

తెలంగాణ రాష్ట్ర ప్రధాత సోనియా గాంధి.. – రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం.

తెలంగాణ రాష్ట్ర ప్రధాత సోనియా గాంధి..
– రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం.
– కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయ్యూబ్ పాషా.
ఊరుకొండ, డిసెంబర్ 9 (జనంసాక్షి):
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ముందుండి నడిపించిన గొప్ప మహోన్నత వ్యక్తి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయ్యూబ్ పాషా అన్నారు. శుక్రవారం ఊరుకొండ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు శ్రీమతి సోనియా గాంధి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి.. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అయూబ్ పాషా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలని సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రదాత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియాగాంధీ అని,
నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను, ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తెలంగాణ రాష్ట్రం ఇచ్చి సోనియాగాంధీ తెలంగాణ కలను సాకారం చేసిందని, తెలంగాణ ప్రజలందరూ సోనియాగాంధీ గారికి రుణపడి ఉంటారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టడం ఖాయమని అన్నారు..
సోనియా గాంధీ చేసిన త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికి గుర్తుంచుకుంటారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారికి.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంఠం విజయుడు, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య, మాజీ వార్డ్ మెంబర్లు కంఠం నరసింహ, రఫిక్, కంఠం ఏశోపు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఓర్సు ఆంజనేయులు, దారరాజు, అది, కంఠం తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.