Wednesday, 4 November 2026

వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం హుజూర్ నగర్ జనవరి 9 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని వాసవి భవన్ లో వాసవి క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వాసవి క్లబ్ నూతన అధ్యక్షుడిగా అడ్డిగ్గి రవికుమార్, సెక్రెటరీ వంగవీటి రామకృష్ణ, కోశాధికారి స్వామి, గోపి కొంతమంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయిత రాము వికేఎస్పి నెంబర్, వాసవి క్లబ్ సూర్యాపేట గవర్నర్ వంగవీటి గురుమూర్తి, వూర వెంకయ్య, ఓరుగంటి నాగేశ్వరావు, వంగవీటి హనుమంతరావు, కందిబండ నరసింహారావు, పెండ్యాల నాగరాజు, ఓరుగంటి నరసింహారావు, పోలిశెట్టి లక్ష్మీనరసింహారావు, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, ఉప్పాల గోపాలకృష్ణమూర్తి, నోముల వెంకటేశ్వర్లు, రేపాల వెంకటేశ్వర్లు, నేరుమళ్ళ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.