కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మే 9 :-. ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విషారాదన్ మహారాజ్ ఆధ్వర్యంలో మంగళవారం కాప్రా మండల తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని రాష్ట్రంలోని ప్రతి పౌరునికి భారత రాజ్యాంగ గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేయాలని అందులో ఉన్న మౌలిక అంశాల మీద చట్టాల పైన నేటి ప్రభుత్వాలు అవగాహన కల్పించాలనే డిమాండ్లను వినతి పత్రంలో పేర్కొన్నట్లు ధర్మ సమాజ్ పార్టీ కాప్ర మండల కోఆర్డినేటర్ శ్రీధర్ మహారాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ శ్రీధర్ మహారాజ్, శ్రీనివాస్ మహారాజ్, రవి మహారాజ్, రమేష్ మహారాజ్, కుమార్ మహారాజ్, ఉపేందర్ మహారాజ్, శ్రీనివాస్ మహారాజ్, ధర్మేష్ మహారాజ్ సైదులు మహారాజ్ లు పాల్గొన్నారు




