తహసీల్దార్ కు జర్నలిస్టుల వినతి.
ఫొటో : వినతి పత్రాన్ని అందజేస్తున్న జర్నలిస్ట్లు.
నెన్నెల, డిసెంబర్ 28, (జనంసాక్షి )
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం నెన్నెల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ భూమేశ్వర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరగా తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. ఈకార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ గౌసోద్దీన్ బాబా, ప్రధాన కార్యదర్శి ముజాఫర్, సభ్యులు సుంకరి నారాయణ, సుంకరి శ్రీనివాస్, హాజి పాషా, నవీన్, నరేష్, రాజన్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కు జర్నలిస్టుల వినతి




