తాగుడు కు బానిసై భార్యను హత్య చేసిన భర్త 

 

భార్య ఝాన్సీలక్ష్మి పై కత్తి తో దాడి చేసి హత్య చేసిన భర్త సత్యనారాయణ

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 15 తాగుడికి బానిసై క్షణికాఆవేశంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే న్యూ బోయిన్‌పల్లి లోని నూతన్ కాలనీ ఉంటున్న భార్య ఝాన్సీ లక్ష్మి పై భర్త సత్యనారాయణ క్షణికావేశంలో కత్తి తో దాడి చేసి హత్య చేశాడు. మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వలేదని భార్య ఝాన్సీ లక్ష్మి తో గొడవ పడి బంధువుల ఇంటికి వచ్చిన ఝాన్సీ లక్ష్మి పై సత్య నారాయణ ఒకసారి గా గొడవ తలెత్తగా ఆవేశంలో కత్తితో ఝాన్సీ లక్ష్మీ మెడపై నరకడంతో తీవ్ర రక్త స్రావం కావడంతో  ఆమె అక్కడిక్కడే మరణించింది, అంతేకాకుండా అడ్డుకున్న మరో మహిళ కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు, సత్యనారాయణ స్వస్థలం అమలాపురం లాగా ఇతనిపై గతంలో కూడా హత్యా నేరం కింద కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ బంధువుల ఇంటికి వచ్చి తన భార్యపై కత్తితో దాటకి పాల్పడి హత్య చేశాడు.ఘటనస్థలికి చేరుకున్న బోయిన్‌పల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆస్పత్రికి తరలించారు.భార్యను హత్య చేసిన అనంతరం సత్యనారాయణ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు బోయిన్‌పల్లి పోలీసులు తెలియజేశారు.

తాజావార్తలు