పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం
జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్ ఉద్యోగుల సమ్మెకు రామగిరి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో శనివారం బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. సందర్భంగా బిజెపి నాయకులు మోలుమూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పారిశుద్ధ కార్మికుల న్యాయమయినా డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు ఉద్యోగులు ఉండారాని మాటిచ్చిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డాక పారిశుద్ధ కార్మికులను మర్చిపోయారని మున్సిపల్ కార్మికులకు ఓ న్యాయం.. పరిశుద్ధ కార్మికులకు ఓ న్యాయమా..? అని అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వచ్చినప్పుడు కీలకపాత్ర పోషించింది పారిశుద్ధ కార్మికులే అని అన్నారు. మరణానికి భయపడకుండా గ్రామ పరిశుభ్రతతే మన పరిశుభ్రతత అని అన్నారు. ప్రమాదంలో మరణించిన వర్కర్ కి 10 లక్షలు చెల్లించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఐటీ మరియు సోషల్ మీడియా మంథని అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ తొట్ల రాజు, సీనియర్ నాయకులు శ్రీమల్ల తిరుమలు,కుంట చక్రి,కందుల రమేష్,పరిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షులు కన్నురి రాంచేందర్,శ్రవణ్, సంపత్,మల్లక్క రజిత,శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.