Tuesday, 3 November 2026

తాజ్ పూర్ గ్రామంలో దొడ్డి కొమురయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో నిర్మించిన దొడ్డి కొమురయ్య బీసీ భవన్ ను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు , అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం , నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ మరియు తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్ , రామకృష్ణ రెడ్డి , దూదిమెట్ల బాలరాజు యాదవ్ లతో కలిసి ఆవిష్కరించి వారికి ఘన నివాళులర్పించిన భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం, భుక్తికోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం అని తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్మరణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య అని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబములో జన్మించిన కొమరయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అని అన్నారు.అప్పట్లో నిజాం పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు, దేశ్ పాండేలు మొదలైన దొరల దురాగతాల కారణంగా విసిగి వేసారిన ప్రజలకు ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుల సంఘం ఒక దివిటీ లాగా కనిపించేది. దొడ్డి కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య కూడాఆంధ్రమహాసభ కమిటీ సభ్యుడిగా పనిచేసేవాడు. తన అన్న ప్రభావం చేతనూ, దొరల దురాగతాలు ఎదిరించడానికి ఆంధ్రమహాసభయే చక్కని వేదిక అని గ్రహించిన కొమరయ్య కూడా సంఘంలో చేరి వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవాడు అని దొడ్డి కొమురయ్య త్యాగాలను గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాతనే సీఎం కేసీఆర్ దయవల్ల బీసీ కులాలు ఎంతో అభివృద్ధి చెందినవి అని బిఅర్ఎస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉంది అని అన్నారు. గ్రామ సర్పంచ్ బొమ్మరపు సురేష్ ఉప సర్పంచ్ ;గ్రామ శాఖ అధ్యక్షుడు ర్యాకలసంతోష్ శ్రీనివాస్ బిఆర్ఎస్,జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జెడ్పిటిసి బీర్ మల్లయ్య, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి మండల అధ్యక్షుడు జనగాం పాండు , వైస్ మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బల్మూరి మధుసూదన్ రెడ్డి నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి గ్రామ చిన్నం పాండు ఎంపిటిసిలు నోముల మహేందర్ రెడ్డి కాంగ్రెస్ వార్డు మెంబర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.