ఏర్గట్ల జులై 04( జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని రేణుక ఎల్లమ్మ గుడికి, అలాగే మార్కండే గుడికి ఒక్కొక్క గుడికి 12 లక్షల రూపాయల చొప్పున మొత్తం 24 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ కాపీలను మంగళవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి సంఘ సభ్యులకు అందజేశారు..అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గుడులు,బడులు,వైద్యంకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని మీరే ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుల్లె రాజేశ్వర్, ఎంపీటీసీ మధుసూదన్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజాపూర్ణనందం, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, ఏర్గట్ల గౌడ సంఘ సభ్యులు కోలా రమేష్ గౌడ్, పచ్చిమట్ల హరీష్ గౌడ్, రంగు కరుణాకర్ గౌడ్, సుదనవేని శ్రీనివాస్ గౌడ్, పచ్చిమట్ల ప్రదీప్ గౌడ్, కలకత్తా రమేష్ గౌడ్,రంజిత్ గౌడ్, రాజు గౌడ్, పద్మశాలి సంఘ సభ్యులు కామన్ శివకుమార్,పిట్ల నరేష్, బొచ్చు వేణుగోపాల్, చుక్కల నరేష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
రేణుక ఎల్లమ్మ గుడి, మార్కండేయ గుడిలకు ప్రొసీడింగ్ కాఫీలు అందజేత




