తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ.
బెల్లంపల్లి, నవంబర్ 18, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై అబ్దుల్ సత్తార్ సహాయ సహకారాలతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కల్వరి యువశక్తి అందాశ్రమంలో నివసిస్తున్న మతిస్థిమితం లేని వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపకుడు ఉస్మాన్ పాషా మాట్లాడుతూ స్థానికంగా ఉన్న స్వచ్చంద సేవా సంస్థలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇలాంటి వాళ్ళ మధ్య పుట్టిన రోజు, పెళ్లి రోజుల వంటి వేడుకలు జరుపుకోవాలన్నారు. వీళ్ళతో కలిసి ఒక్క రోజు గడపడం వలన వీరికి కుటుంబం లేని లోటును కాస్తయినా తీర్చినట్టవుతుందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి ఇలాంటి వాళ్లకు చేయూతనివ్వాలాన్నారు. ఈ కార్యక్రమంలో తాజ్ బాబా సేవాసమితి సభ్యులు ఇస్మాయిల్, తాజ్, ఉమేర్ నావాజ్, రిఫ్ఫత్ తదితరులు పాల్గొన్నారు.
తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ.




