పిడి సుందర్రావు జన్మదిన వేడుకలు సందర్భంగా వృద్దులకు పండ్లు పంపిణీ
అశ్వారావుపేట, నవంబర్ 18(జనం సాక్షి)
ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా,
ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కొత్తగూడెం సంయుక్త ఆధ్వర్యంలో
ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు జయశాలి పిడి సుందర్ రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని
lఅమ్మ సేవాసదనం వృద్ధాశ్రమం లో
వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ అశ్వారావుపేట మండల ప్రెసిడెంట్
ఎం భాస్కర రావు మాట్లాడుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఏసుక్రీస్తు భోదలను అనుసరిస్తూ
ఈనెల 20వ తేదీన
పిడి సుందర్ రావు జన్మదినం పురస్కరించుకొని ఆయన జన్మదినం ముందు నుండే సేవా కార్యక్రమంలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ప్రజలలో క్రీస్తుకు కలిగిన జాలి దయ కరుణమనసు కలిగి ఉండాలి అన్నారు,
ఈ కార్యక్రమము నిర్వహించినవారు,
ప్రెసిడెంట్ ఎం భాస్కర రావు
వైస్ ప్రెసిడెంట్ కౌవులూరి రమేష్
సెక్రెటరీ సోయం కోటి
జాయింట్ సెక్రెటరీ కొరస రాముడు
ట్రెజరర్ గుర్రం శ్రీను
తదితరులు పాల్గొన్నారు.





