Tuesday, 3 November 2026

తాటి వనం దగ్ధం. ఏదేచ్చేగా నరికివేత.గీతకార్మికుల ఆందోళన.

జనం సాక్షి.సైదాపూర్. మండలంలోని సోమవారం గ్రామ శివారులోని కొందరు వ్యక్తులు తాటివనాన్ని నిప్పు పెట్టి దగ్ధం చేయడమే కాకుండా ఏదేచంగా గోడ్డలితో నరికి వేశారనీ కొందరు గౌడ్ అన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుప్రభుత్వ భూములలో ఉన్నటువంటి మరియు పట్టా భూముల్లో ఉన్నటువంటి తాటి చెట్లను కొందరు కావాలని నరికి వేశారు దౌర్జన్యంగా జెసిబి ల తోటి రాత్రి వేళల్లో తాటి చెట్లను తొలగించేస్తున్నారని సోమవారం గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గీతా.వృత్తిపై. పై సొసైటీలో కొన్ని వందల మంది కుటుంబాలు వీధిన పడుతున్నాయని గౌడ్ అన్నలు.ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు 90 కుటుంబాలు ఈ వృత్తిపై నమ్ముకొని తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని గౌడ్ అన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నరికివేతలు అడ్డుకోకుంటే మా కులవృత్తికే ప్రశ్నార్థకం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై స్థానిక ఎక్సైజ్ అధికారులకు కొందరు గౌడ్ అన్నలు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు దగ్ధం చేసిన వ్యక్తులను మరియు నరికి వేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌడ్ అన్నలు డిమాండ్ చేస్తున్నారు