మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్ 24.ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ జాతిని కించపరుస్తూ దుర్భాషలాడితే నీకు పుట్టగతులు ఉండవని నోరు అదుపులో పెట్టుకోవాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు వీకే మహేష్ హెచ్చరించారు.ఓ టీవీ ఛానల్ కు చెందిన ఫోటోగ్రాఫర్ ను కారులో ఎక్కించుకొని ఏ కులం రానిదని భయపడితే ముదిరాజ్ కులమని చెప్పడంతో వర్ణించలేని భాషలో దుర్భాషలాడారని పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నేరెడ్ మెట్ ముదిరాజ్ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.పాడి కౌశిక్ రెడ్డి నీకు ప్రభుత్వం అండగా ఉందని నీ ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని,ఎక్కడైతే ముదిరాజ్ జాతిని కించపరుస్తూ సభ్యకరంగా మాట్లాడినవో అక్కడే ముదిరాజ్ లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోనేరెడ్ మెట్ ముదిరాజ్ సంఘం నాయకులు బళ్లారి అశోక్,తుపాకుల జనార్ధన్,శ్రీశైలం ముదిరాజ్,శ్రీకాంత్ ముదిరాజ్,బాల నరసింహ,శ్యామ్ ముదిరాజ్,తదితరులు పాల్గొన్నారు.
పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.




