డోర్నకల్ మార్చి /7/ జనం సాక్షి న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఐదు రోజులు జరిగే శ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి ఉత్సవంలో భాగంగా స్వామి వారికి జలాభిషేకం చేయుటకు జలబిందలతో గౌడ కులస్తులు డప్పు వాయిద్యాలతో, కోలాట ఆటపాటలతో, ఆడపడుచులు పసుపు కుంకుమలతో స్వామిని కోలుస్తూ సంబరంగా స్వామి సన్నిధికి బయలుదేరి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ కంఠమహేశ్వరునికి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయినపల్లి వెంకన్న,పెద్ద గౌడ్ బోయినపల్లి మల్లయ్య గౌడ్, సారకల్ల గౌడ్ బోయినపల్లి బిక్షం గౌడ్,గౌడ సర్పంచులు గునిగంటి అంజయ్య గౌడ్,కంపాటి మధు గౌడ్,గౌడ కులస్తులు,యువకులు, గౌడ కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




