తార డిగ్రీ కళాశాల సందర్శించిన టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి, జూలై 13 : మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం TSHDC చైర్మన్ చింత ప్రభాకర్ సందర్శించారు.ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ తారా కళాశాలలో మౌలిక సదుపాయాల కోసం ఎం.డి.ఎఫ్.టి నిధుల ద్వారా 55 లక్షలతో మరుగుదొడ్లు , సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రహరీ గోడకు రూ.50లక్షలు నిధులు మంత్రి హరీష్ రావు మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు. తారా కళాశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ కు కూడా మంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ కళాశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చింతా ప్రభాకర్ సహకారంతో నిధులు మంజూరు కావడంపై తారా కళాశాల యాజమాన్యం చింతా ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. అలాగే అడిగిన వెంటనేనిధులు మంజూరు చేసిన మంత్రి హరీష్ రావుకు, చింతా ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.