నిరుపేదలకు అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ -పౌండేషన్ చెర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి
తిరుమలగిరి (సాగర్ ),(జనంసాక్షి ) జూలై 13: నిరుపేదలకు అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఉంటుందని ఆ సంస్థ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి అన్నాడు గురువారం మండలంలోని అల్వాల, శ్రీరాంపల్లి,కీచ్యతండ, గరికెనట్ తండా,డొక్కలబావి తండా, జువ్వి చెట్టు తండా గ్రామాల్లో 32మంది నిరుపేద కుటుంబాలకు రూ. 5వేలు చొప్పున మొత్తం 160000/-రూపాయలు ఆర్థిక సహాయం చేసారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు ఇటువంటి సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మునుముందు పౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి (సాగర్) మండల వైస్ ఎంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి, సర్పంచులు శంకర్ నాయక్,స్వామి ,బిచ్య నాయక్, నెల్లికల్ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి, కేళావత్ జ్యోతి రామకృష్ణ, పెద్దవూర ఉప సర్పంచ్ ప్రదీప్ రెడ్డి, తిరుమలనాథ చైర్మన్ బుర్రి రామిరెడ్డి,ప్రసాద్, కోటేష్, రమేష్ చారి, లింగస్వామి, లక్కీ ఫుడ్ కోర్ట్ భాస్కర్ రెడ్డి, నాగార్జున రెడ్డి,తేరా అఖిల్ రెడ్డి,తేరా సురేష్ రెడ్డి,పల్ రెడ్డి లక్ష్మారెడ్డి, ముస్తాఫ,ఫౌండేషన్ కో -ఆర్డినేటర్ మండలి లింగయ్య, మండల ఎక్జిక్యూటివ్ మహేష్ తదుతరులు పాల్గొన్నారు.