వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 27 (జనం సాక్షివరంగల్ మహానగరంలోని తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు తాళ్ల పద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిగాయి.వరంగల్ ఏసిపి బోనాల క్రిషన్, చైతన్య యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ దామోదర్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని జి సరిగమప లిటిల్ శామ్ టైటిల్ విన్నర్ చిన్నారి సాయి వేద వాగ్దేవి ప్రత్యేక అతిథిగా విచ్చేసి తన యొక్క పాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సందర్భంగా ఏసిపి కిషన్ మాట్లాడుతూ వరంగల్ నగరంలో తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్ ఉండడం నిజంగా ప్రజల అదృష్టంగా అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, విద్యతోపాటు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడే విధంగా అన్ని రకాల క్రీడా ప్రాంగణములతో ఒక చక్కటి పాఠశాల ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అంతర్జాతీయ స్థాయి లో వ్యవస్థాగత సంబంధాలతో విద్యార్థుల భాషా నైపుణ్యాలను భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించే వివిధ కార్యక్రమాలను నిర్వహించడం కేవలం ఒక్క తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్ కే చెల్లిందని కొనియాడారు. ప్రొఫెసర్ దామోదర్ మాట్లాడుతూ ఈ పాఠశాల విద్యార్థులు ఇతర దేశ విద్యార్థులతో ఆన్లైన్ సదస్సులలో పాల్గొని భారత దేశ సంస్కృతి గురించి మాట్లాడటం తాను ప్రత్యక్షంగా చూసానని ఆ కార్యక్రమం చాలా గొప్పగా ఉందని అభినందించారు.ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు తమ యొక్క పాటలతో నృత్యాలతో నాటిక ప్రదర్శనలతో వచ్చిన ప్రేక్షకులను తల్లిదండ్రులను ఎంతగానో ఆకర్షించారు. విద్యతోపాటు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఒక అంతర్జాతీయ స్థాయి విద్యా బోధనను వరంగల్ ప్రాంతీయులకు అందించాలని సంకల్పంతో తమ పాఠశాలను స్థాపించడం జరిగిందని మునుముందు మరిన్ని నూతన కార్యక్రమాలతో తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీనిస్తూ పాఠశాల చైర్మన్ తాళ్ల మల్లేశం మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తాళ్ల పద్మావతి విద్యాసంస్థల డైరెక్టర్ తాళ్ల వంశీ, చైతన్య వైష్ణవి పాఠశాల ప్రిన్సిపల్ స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.





