తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో ఫ్రెషర్స్ డే సంబరాలు
వరంగల్ బ్యూరో చీఫ్, జనవరి 07( జనం సాక్షి)
వరంగల్ నగరంలోని తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో శనివారం బి ఫార్మసీ ఏం ఫార్మసీ విద్యార్థులు ఫ్రెషర్స్ డే పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా అడిషనల్ డీసీపీ డాక్టర్ పుష్ప హాజరయ్యారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత చదువులు చదవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజ్యలక్ష్మి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, డైరెక్టర్స్ తాళ్ల వరుణ్, బేటి శ్రీనివాస్, పుష్టి, సత్యనారాయణ పట్నాయక్, కల్పన, నాగిరెడ్డి, ఏవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.




