ఎర్గట్ల ఏప్రిల్ 10 (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయానికి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదర సోదరీమణులకు అందజేస్తున్న రంజాన్ తోపాలతో పాటు 25వేల రూపాయల చేక్కు వచ్చినట్టు తాసిల్దార్ బింగి జనార్ధన్ తెలిపారు.ప్రతి రంజాన్ పండగ రోజున వారికి ఇఫ్తార్ విందు బీద ముస్లిం సోదరి, సోదరులకు నూతన బట్టలను ఇచ్చి వారి యొక్క పండగను ఘనంగా జరపడానికి ప్రభుత్వం దోహదపడుతుందని తాసిల్దార్ తెలియజేశారు.
తాసిల్దార్ కార్యాలయానికి చేరుకున్న రంజాన్ తోపాలు




