Wednesday, 4 November 2026

13న కమాన్ పూర్ లో శ్రీపాద రావు వర్ధంతి – హాజరుకానున్న ఎఐసిసి కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు – మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్

 జనంసాక్షి, కమాన్ పూర్ : దివంగిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు వర్ధంతి వేడుకలను ప్రతి సంవత్సరం మంథని నియోజకవర్గంలోని ఏదో ఒక మండలంలో నిర్వహిస్తుండగా.. ఈ సంవత్సరం ఇప్పుడు ఏప్రిల్ 13వ తేదీన స్వర్గీయ శ్రీపాద రావు వర్ధంతి పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూoపల్లి రాజయ్య ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ హాజరై కాంగ్రెస్ నాయకులతో చర్చించారు. అనంతరం ఏప్రిల్ 13వ తేదీన కమాన్ పూర్ లో జరుగబోయే స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతి సభా వేదిక స్థలాన్ని ఆయన మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిలారపు మల్లయ్య , ఆకుల ఓదెలు, కటకం రవీందర్, షేవ్వ శంకరయ్య, గాండ్ల మోహన్ , వైనాల రాజు ,రంగు సత్యనారాయణ, శ్రీధర్ రావు , మల్యాల తిరుపతి, అఫ్సర్, సయ్యద్ ఈక్బాల్, పెండ్యాల రాజు, లింగాల కుమార్, మల్లయ్య, కోల నరేందర్, బంగారు మహేష్ ,కోల నర్సన్న,ఎర్రన్న, ఈరుగురల శేఖర్, కుక్క రవి,నునేటి మల్లికార్జున్, చాట్ల రాయమల్లు, కనుకయ్య కొమురయ్య, సుధాకర్ గౌడ్, ఈరుగురాల రాజు, అరెల్లి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.