Thursday, 5 November 2026

తిత్లీ సాయం వేరుశనగంత..  ప్రచారం ఎవరెస్టంత

– టీడీపీ ప్రచారంపై పవన్‌ కళ్యాణ్‌ కౌంటర్‌
అమరావతి, నవంబర్‌12(జ‌నంసాక్షి) : అధికార తెలుగుదేశం పార్టీపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. తిత్లీ తుఫాన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాలా ఆదుకున్నామని చెబుతోన్న ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. ఆయనకు దొరుకుతోన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జనసేనాని అక్కడి ప్రజలకు అసలు సాయమే అందలేదని ఆరోపించారు. ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడి బాధితులను పరామర్శించారు. అండగా తానుంటానని హావిూ ఇచ్చారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సవిూపిస్తున్న వేళ పవన్‌ కళ్యాణ్‌కు తిత్లీ తుఫాన్‌ ఘటన ఒక ఆయుధంలా మారింది. అందుకే దీన్ని ఉపయోగించుకుని చంద్రబాబు ప్రభుత్వం దాడికి దిగుతున్నారు. తాజాగా టీడీపీ ప్రభుత్వ ప్రచారాలను పవన్‌ సోషల్‌ విూడియా వేదికగా విమర్శించారు. ‘తిత్లీ తుఫాను బాధితులకు ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం కొండంత అండ!’ అని బస్సుపై ఏపీ ప్రభుత్వం అతికించిన ప్రచార చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన పవన్‌.. ‘తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసిన సాయం వేరుశనగంత, కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్‌ అంత అంటూ విమర్శ చేశారు. ఇది చూస్తుంటే అబ్రహం లింకన్‌ చెప్పిన సూక్తి ఒకటి గుర్తుకొస్తోందని పేర్కొన్నారు. పబ్లిసిటీ ఎంత గుర్తింపు తీసుకొస్తుందో అబ్రహం లింకన్‌ చెప్పిన సూక్తిని తన పోస్ట్‌లో పవన్‌ పేర్కొన్నారు.