తిమ్మప్ప స్వామి దేవాలయం సందర్శించిన హైకోర్టు న్యాయవాది
మల్దకల్ డిసెంబర్ 29(జనం సాక్షి)మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గురువారం హైకోర్టు న్యాయవాది డి నాగభూషణం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు,సత్య చంద్రారెడ్డి,అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు చేయించి స్వామి వారి చరిత్రను వివరించారు.




