Tuesday, 3 November 2026

సింగరేణి రిటైర్డ్ మిత్రులకు శుభ వార్త

సింగరేణి రిటైర్డ్ మిత్రులకు శుభ వార్త…….

మెడికల్ కార్డు రెన్యువల్ కు మైన్ మేనేజర్ వద్దకు వెళ్ళవలసిన అవసరం లేకుండా, జీవన్ ప్రమాణ్ ద్వారా చేసుకుంటున్న సంగతి మీకు తెలిసిందే.

కానీ ఏరియా హాస్పిటల్ లో మందులు తీసుకోవడానికి, ప్రతి సంవత్సరం రెన్యువల్ కు మైన్ మేనేజర్ తో సంతకం చేయిస్తున్నాం. ఇలా చెయ్యడానికి బావులు మూతపడి, రిటైర్డ్ కార్మికులు ఇబ్బందులను ఎదురక్కొంటున్నారు.

అందువల్ల, నిన్న అనగా తేదీ 28-12-2022 రోజున గోదావరిఖని లోని ఎల్లందు గెస్ట్ హౌస్ లో డైరెక్టర్ చంద్రశేఖర్ ని కలిసి, ఈ సమస్యను వివరించాను. దీని పరిష్కారానికి గాను, సంబంధిత హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ “జీవన్ ప్రమాణ్” తోనే, రెన్యువల్ చేసే విధానం సులభంగా ఉంటుందని కోరడం జరిగింది. దానికి డైరెక్టర్ అంగీకరించి, ఆ విధానం ను అమలు చేపిస్తానని చెప్పారని ఒక ప్రకటన లో
బాబురావు మడిపెల్లి,
ప్రధాన కార్యదర్శి,
కోల్ మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలిపారు.