పల్లె దువాఖానా ఏర్పాటు చేసి ఆరోగ్య తెలంగాణ మార్చడం సిఎం కెసిఆర్ లక్ష్యం
మల్దకల్ డిసెంబర్ 29 (జనంసాక్షి)గద్వాల నియోజకవర్గంలో మల్డకల్ మండలం పరిధిలోని పాల్వాయి,ఎల్కూర్, విఠలాపురంగ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంపల్లె దవాఖానాలను గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి,జెడ్పీ చైర్మన్ సరిత కలిసి ప్రారంభించారు.16 లక్షలతో పల్లె దువాఖానాను చేపట్టారు.ఎమ్మెల్యేమాట్లాడుతూ
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక, వైద్య సదుపాయాలు లేక పేద ప్రజలు ఆరోగ్యపరంగా ఇబ్బందులకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు. రోడ్డు ప్రమాదం జరిగిన ఆపరేషన్ల కొరకు ఇక్కడ నుండి కర్నూల్ కు హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి చికిత్సను పొందేవారు.వీరిలో కొంతమంది మార్గమధ్యలోని ప్రాణాలను కోల్పోయేవారు.కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వైద్యాలయానికి పెద్ద పీట వేసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో కరోనా సమయంలో కూడా అన్ని రకాల వైద్యం అందజేశారు. డయాలసిస్ పేషెంట్ల ప్రత్యేకంగా చికిత్సను అందించడం జరిగింది. అన్ని రకాల పరీక్షలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చూడడం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం కంటి వెలుగు కార్యక్రమంలో జనవరి నెలలో మరొకసారి ప్రారంభం అవుతుంది,ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రతి గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యము అందుబాటులో ఉండాలని పల్లె దువాఖానా ఏర్పాటు చేసి అన్ని వసతులతో సౌకర్యాలతో వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో కార్పొరేటర్ స్థాయిలో అన్ని రకాల సంబంధించిన వైద్యులను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యము అందజేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ,ఎంపీపీ రాజారెడ్డి, సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి,వైస్ ఎంపీపీ వీరన్న, మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,సర్పంచులు శివారెడ్డి, పురుషోత్తం రెడ్డి,పార్టీ నాయకులు సీతారాం రెడ్డి, విక్రమ్,సింహరెడ్డి,అజయ్, మధు,చంద్రశేఖర్ రెడ్డి,నరేందర్,నరసింహారెడ్డి,భాస్కర్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




