.తిరుమల ఎలక్ట్రానిక్స్ బంపర్ బహుమానం అందజేత.
సిరిసిల్ల. జనవరి 18. (జనం సాక్షి). సిరిసిల్ల పట్టణంలోని తిరుమల ఎలక్ట్రానిక్స్ ఇటీవల పండగ సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్ అందజేసింది. బుధవారం సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. కటకం వినోద్ కుమార్ డ్రా లో బైక్ ను గెలుపొందారు. గెలుపొందిన వినోద్ కుమార్ కు తిరుమల ఎలక్ట్రానిక్స్ నిర్వాహకులు బైక్ ను అందజేశారు. 36 మంది లక్కీ డ్రాలో వివిధ బహుమతులు గెలుచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తిరుమల ఎలక్ట్రానిక్స్ అధినేత పోకల సుమన్, సుధాకర్ సాంసంగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆనంద్ సల్ల తదితరులు పాల్గొన్నారు.
తిరుమల ఎలక్ట్రానిక్స్ బంపర్ బహుమానం అందజేత




