Thursday, 5 November 2026

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కొలిశెట్టి వజ్రమ్మ మృతితెలంగాణ

సాయుధ పోరాట యోధురాలు కొలిశెట్టి వజ్రమ్మ మృతి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): కుడకుడ గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు తల్లి కొలిశెట్టి వజ్రమ్మ  మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు.బుధవారం ఆమె పార్తివదేహంపై ఎర్రజెండా కప్పి జోహార్లు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రమ్మ పార్టీ సభ్యులుగా, సానుభూతిపరులుగా ఉండి అనేక ఉద్యమాలకు పోరాటాలకు సహకారాన్ని అందించారని అన్నారు.సిపిఎం బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు.తన ఇద్దరు కుమారులను కూడా సీపీఎం , ప్రజానాట్యమండలిలో పనిచేసే విధంగా తగిన ప్రోత్సాహన్ని అందించారని అన్నారు.వజ్రమ్మ మృతికి పార్టీ జిల్లా కమిటీ తరపున సంతాపం, సానుభూతిని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, జె.నరసింహరావు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి రాంబాబు, కుడకుడ సీపీఎం శాఖ కార్యదర్శి కంచుగట్ల శ్రీనివాస్, సీపీఎం టూ టౌన్ కమిటీ సభ్యురాలు పిండిగ నాగమణి తదితరులు పాల్గొన్నారు.