Tuesday, 3 November 2026

తిరుమల రెండో కనుమ రహదారిపై జారిపడ్డ కొండచరియలు

zd0wzkc8తిరుమల: తిరుమల రెండో కనుమ రహదారిపై కొండచరియలు జారిపడ్డాయి. లింక్‌ రోడ్డు సమీపంలో కొండచరియలు పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారికి అడ్డంగా ఉన్న కొండచరియలను తితిదే సిబ్బంది క్రేన్‌ సాయంతో తొలగిస్తున్నారు. లింక్‌రోడ్డు నుంచి ఒకటో కనుమ రహదారికి వాహనాలను మళ్లిస్తున్నారు. ఒకటో కనుమ రహదారిలో ప్రత్యేక బలగాలు మోహరించి వాహనాల రద్దీని నియంత్రిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *