తుంగభద్రపై తాత్కాలిక గేటు ఏర్పాటుకు కసరత్తు
` ఈప్రక్రియ ఇంజనీరింగ్ సాహసం
` నిపుణుల వెల్లడి
బళ్లారి(జనంసాక్షి):కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు అమర్చేందుకు చర్యలు చేపట్టారు. ఇది ఇంజినీరింగ్ సాహసమేనని నిపుణులు చెబుతున్నారు. 19 నంబర్ గేటు స్థానంలో 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు ఉన్న భారీ గేటును అమర్చనున్నారు. ఒకవైపు నీరు వెళ్తుండగానే దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన పనులను జిందాల్‌తో పాటు మరో రెండు సంస్థలకు అప్పగించారు. గేటు ముక్కలను తయారు చేసి తుంగభద్ర డ్యామ్ వద్దకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మూడు సంస్థలు తయారు చేసిన గేటు ముక్కలను ప్రవాహం విూద ఉంచి అక్కడే వెల్డింగ్ చేసి అతుకులు పెట్టనున్నారు. 8 అడుగుల ఎత్తులో భారీగా వెళుతున్న ప్రవాహం విూది నుంచి నీటిని అడ్డుకుంటూ గేటును కిందికి దించనున్నారు. నిండుగా ఉన్న ప్రాజెక్టునుంచి నీరు వెళుతుండగా గేటు అమర్చడం సాహసోపేతమైన చర్యగా నిపుణులు పేర్కొంటున్నారు.