ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ముజఫర్ నగర్ జిల్లా బొపారా గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు 15 ఏళ్ల బాలికపై తుపాకితో బెదిరించి అత్యాచారం చేశాడు. అంతేకాకుండా విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బిదెరించాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు వివరించింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించామని, అయితే అతను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఆమె సోదరుడికి రాత్రి పూట భోజనం పెట్టి తిరిగి వస్తుండగా బుధవారం రాత్రి ఆ సంఘటన జరిగింది. యువకుడు వచ్చి అమ్మాయిని సమీపంలోని ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు.




