Tuesday, 3 November 2026

తూంపల్లిలో వడగళ్ల వాన కురిసి బీభత్సం

సిరికొండ: మండలంలోని తూంపల్లి వన్నాజీపేట్‌ గ్రామాల్లో నేటి తెల్లవారుజామున వడగళ్ల వాన కురిసి బీభత్సం సృష్టించింది. తూంపల్లిలో దాదాపు వంద మందికి చెందిన 300ఎకరాల విస్తీర్ణంలో వరిపంట దెబ్బతింది. గోప్యానాయక్‌ తాండాలో రెండు పూరిళ్ల పైకప్పులు లేచిపోయాయి. తాండాలోని ప్రాథమిక పాఠశాల వంటగది పైకప్పు రేకులు ఎగిరి పొలాల్లో పడ్డాయి. మామిడి చెట్ల కాపు రాలిపోవటంతో పాటు కొమ్మలు విరిగిపోయాయి. పంట నష్ట్పరిహారాన్ని రెవెన్యూ, వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. చేతికి అంది వచ్చిన వరిపంట వడగళ్లు పడి పాడవటంతో బాధిత రైతులు పంట చేల వద్ద విలపిస్తున్నారు. మండలంలోని ఉన్నాజీపేట్‌ గ్రామంలోనూ వందెకరాలకు పైగా వరిపంట వడగళ్ల ధాటికి దెబ్బతింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *