Sunday, 8 November 2026

ధరణి పోర్టల్ ను రద్దు చేయాలి మాజీ శాసనసభ్యులు

ధరణి పోర్టల్ ను రద్దు చేయాలి మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ కొండమల్లేపల్లి నవంబర్ 24 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలో గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భూ సమస్యల పరిష్కరం కోసం ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నేడు రైతు రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కొండమల్లెపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం రాస్తారోకో మరియు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.అనంతరం డిప్యూటీ తహశీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు, టీపీసీసీ రాష్ట్ర నాయకులు సిరాజ్ ఖాన్ ,మండల పార్టీ అధ్యక్షుడు వేమన్ రెడ్డి ,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డుపల్లి సైదులు, జగన్ నాయక్, రవి నాయక్, శ్రీరాములు, రాకేష్, మంగ్యా నాయక్, కైసర్ ఖాన్, అందుగుల ముత్యాలు, అందుగుల లింగయ్య, ఎండి ఖదీర్, సేవా నాయక్ మరియు వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.