` మంత్రి ఈట రాజేందర్ ఆశాభావం
` గచ్చిబౌలిలో 15 రోజుల్లో 1500 పడక ఆస్పత్రిని సిధ్దం చేశామని వ్లెడి
హైదరాబాద్,ఏప్రిల్ 8(జనంసాక్షి):
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టొచ్చని మంత్రి ఈట ఆశాభావం వ్యక్తం చేశారు.హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజా కేసుతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 453కి చేరుకుందన్నారు. వీరిలో 11 మంది మృతిచెందగా.. 45 మంది కోుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 397 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. చికిత్స పొందుతున్నవారిలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని.. వారిలో కొందరికి పరీక్షు నిర్వహించి నెగటివ్ వచ్చిన వారిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 80 ప్రాంతాను హాట్‌స్పాట్‌ుగా గుర్తించామని మంత్రి చెప్పారు.
వారిని ఇంటికి పంపిస్తున్నాం
దిల్లీ మర్కజ్ నుంచి రాష్ట్రానికి 1100 మందికి పైగా వచ్చారని ఈట చెప్పారు. మర్కజ్ నుంచి వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన 3,158 మందిని 167 క్వారంటైన్ సెంటర్లలో ఉంచామని.. వారిని పరీక్షించి ఇంటికి పంపిస్తున్నామని తెలిపారు. మర్కజ్ నుంచి వచ్చి టెస్టుల్లో నెగటివ్ వచ్చి వారిని 14 రోజు హోంక్వారంటైన్‌కు పంపిస్తున్నామన్నారు. వారంతా ఏప్రిల్ 21 వరకు ఇళ్లలోనే ఉండాని.. వారిపై వైద్య, పోలీసు సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని ఈట వివరించారు. రోజుకు రెండుసార్లు వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షిస్తారని మంత్రి చెప్పారు. మర్కజ్ కేసు తగ్గినప్పటికీ పరిస్థితిని తేలిగ్గా తీసుకోవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆయన తెలిపారు.
5క్ష పీపీఈ కిట్లకు ఆర్డరిచ్చాం
గత నాుగు రోజుగా పెద్ద ఎత్తున పరీక్షు పూర్తి చేశామని ఈట చెప్పారు. ప్రస్తుతం 535 శాంపిల్స్ మాత్రమే తమ వద్ద ఉన్నాయని.. రేపటికి అవి పూర్తయ్యే అవకాశముందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80 వే పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని, మరో 5క్ష పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇచ్చామని మంత్రి తెలిపారు. వాటితో పాటు 5క్ష ఎన్`95 మాస్కు, 2 కోట్ల డాక్టర్ మాస్కు, కళ్లకు పెట్టుకునే గాగుల్స్ 5క్షు, 3.5క్ష టెస్టింగ్ కిట్లు ఆర్డర్ చేశామని ఈట వివరించారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుకు గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని ఈట స్పష్టం చేశారు. వైద్య పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారిని జిల్లాల్లోనే క్వారంటైన్‌లో ఉంచుతామని ఆయన వివరించారు. గచ్చిబౌలిలో 15 రోజుల్లో 1500 పడక ఆస్పత్రిని సిధ్దం చేశామని చెప్పారు. కరోనా చికిత్సకు 22 ప్రైవేటు వైద్యకళాశాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిలో 15,040 పడకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
తెంగాణలో తగ్గుముఖం పట్టొచ్చు




