Wednesday, 4 November 2026

తెదేపా దీక్ష చేపట్టడం శుభపరిణామం : రాఘవులు

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యలపై తెదేపా దీక్ష చేపట్టడం శుభపరిణామమని సీపీఎం నేత రాఘవులు అన్నారు. గాందీ ఆస్పత్రిలో దీక్ష విరమించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ సమస్యను రాజకీయ అజెండాగా తీసుకురావడంలో తాము సఫలమయ్యామన్నారు. వైరుధ్యాలున్నా విద్యుత్‌ అంశంపై విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురాగలిగామన్నారు. విద్యుత్‌ సమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాటిస్తామని రాఘవులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *