తెదేపా నాయకుల రాస్తారోకో

సిరికొండ: మహరాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరును నిరసిస్తూ తెదేపా నాయకులు సోమవారం సిరికొండలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో ఆ పార్టీ మండల
నాయకులు గంగారెడ్డి, జిల్లా నాయకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంగారెడ్డి మాట్లాడుతూ విద్యుత్తు సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.